కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఓ సత్రంలో భక్తులు, సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో సత్రం సూపర్వైజర్ మృతి చెందారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన నలుగురు భక్తులు.. శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిలబడి భోజనం చేయాలని సిబ్బంది చెప్పడంతో భక్తులకు, సత్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇందులో భాగంగానే తోపులాట జరిగింది.
శ్రీశైలం సత్రం వద్ద ఘర్షణ.. భక్తుల దాడిలో సూపర్వైజర్ మృతి - శ్రీశైలం సత్రం సిబ్బంది దాడిలో సూపర్ వైజర్ మృతి వార్తలు
ఏపీలోని శ్రీశైలంలోని ఓ సత్రం వద్ద ఘర్షణ చోటుచేసుకొంది. ఈ ఘటనలో సూపర్వైజర్ మృతిచెందాడు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందినవాడిగా పోలీసులు తెలిపారు.
శ్రీశైలం సత్రం వద్ద ఘర్షణ.. భక్తుల దాడిలో సూపర్వైజర్ మృతి
ఈ ఘటనలో సూపర్వైజర్ కందిమల్ల శ్రీనివాసరావు కిందపడిపోయి.. తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సిబ్బంది శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని దండమూడి గ్రామం. ఇద్దరు భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.