బుల్లి తెర నటి శ్రావణి కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రావణి స్నేహితుడు దేవరాజ్‌ను 8 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను దేవరాజ్ పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం. శ్రావణి ఆత్మహత్యకు గల అసలు కారణలపై ఆరా తీస్తున్నారు.
ఎనిమిది గంటలకు పైగా విచారణ... నిర్మాత బెదిరించాడన్న దేవరాజ్ - బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు వార్తలు
శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ఎస్సార్ నగర్ పోలీసులు ఎనిమిది గంటలుగా విచారిస్తూనే ఉన్నారు. బుల్లితెర నటి శ్రావణికి అతనికి గల సంబంధంపై ఆరా తీస్తున్నారు. దేవరాజ్ కాల్ రికార్డులను సైతం పరిశీలిస్తున్నారు.
ఆరు గంటలుగా దేవరాజ్‌ను విచారిస్తున్న పోలీసులు
నిర్మాత అశోక్ రెడ్డి తనను బెదిరించాడని దేవరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇద్దరు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సప్ ఆడియోలను దేవరాజ్ పోలీసులకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయికృష్ణా రెడ్డిని విచారించే అవకాశముంది.
ఇదీ చూడండి:'బుల్లితెర నటి ఆత్యహత్య కేసును క్షేత్రస్థాయిలో విచారిస్తాం'
Last Updated : Sep 10, 2020, 7:57 PM IST