భువనగిరి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - yadadri district news
![భువనగిరి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు భువనగిరి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10320316-1044-10320316-1611207740144.jpg)
09:15 January 21
భువనగిరి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు ఉన్న రెండు ఇంజన్లు పట్టాల మీద నుంచి పక్కకు జరిగి భూమి మీదకు చొచ్చుకు వెళ్లాయి. గూడ్స్ రైలు గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆమార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మరమ్మతు పనులు చేయిస్తున్నారు.
ఇవీచూడండి:టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి