తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదిహేను రోజుల క్రితం కిడ్నాప్... ఇవాళ గుండెపోటుతో మృతి - దంతవైద్యుడు హుస్సేన్ మృతి

పదిహేను రోజుల క్రితం కిడ్నాప్​నకు గురైన దంతవైద్యుడు హుస్సేన్​ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. అపహరించి బెంగళూరుకు తరలిస్తుండగా... ఏపీ పోలీసుల సాయంతో హుస్సేన్​ను కాపాడారు.

dentist hussain died with heart attack today morning
పదిహేను రోజుల క్రితం కిడ్నాప్... ఇవాళ గుండెపోటుతో మృతి

By

Published : Nov 12, 2020, 5:29 PM IST

పదిహేను రోజుల క్రితం కిడ్నాప్​నకు గురై... పోలీసుల కృషితో క్షేమంగా బయటపడిన దంత వైద్యుడు హుస్సేన్‌ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో ఆసుపత్రిలో ఉండగా కిడ్నాపర్లు కారులో అపహరించారు.

బెంగళూరుకు తీసుకువెళ్తుండగా... అనంతరపురం వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఆయన క్షేమంగా బయటపడ్డాడని కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే హుస్సేన్‌ గుండెపోటుతో మృతి చెందడం వారిని తీవ్ర విషాదంలో ముంచింది.

ఇదీ చూడండి:48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు..

ABOUT THE AUTHOR

...view details