తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెంది డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందపురి సందీప్.. తన తల్లిదండ్రులు తిట్టారని జీవితంపై నిరాశ చెంది శనివారం పురుగులమందు తాగాడు. ఇదీ గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లి.. చికిత్స అందించారు.
తల్లిదండ్రులు మందలించారని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య - తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య రాయపర్తి
తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెంది డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన మందపురి సందీప్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు తిట్టారని జీవితంపై నిరాశ చెంది శనివారం పురుగులమందు తాగాడు. అది గమనించిన తల్లదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం సందీప్ చనిపోయాడు.
తల్లిదండ్రులు మందలించారని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఈ క్రమంలో సోమవారం సందీప్ మృతి చెందాడు. సందీప్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చేతికందొచ్చిన కొడుకు కళ్లముందే తనువు చాలించడం వల్ల ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. విద్యార్థి మృతితో పోతిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:రెండు ద్విచక్రవాహనలు ఢీ.. ఇద్దరు మృతి