తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిరీటాల చోరీ కేసు నిందితుడికి ఏడాది జైలు శిక్ష - తిరుమల బంగారు కిరీటాల చోరీ కేసు విచారణ వార్తలు

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడింది. 2019 ఫిబ్రవరి 2న ఇద్దరు వ్యక్తులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో బంగారు కిరీటాలను చోరీ చేశారు. ఈ కేసులో ఒక నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధించిన తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు.. మరో నిందితుడు విచారణకు రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

defendant-sentenced-to-one-year-in-prison-for-stealing-gold-crowns-in-tirupati
బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

By

Published : Dec 15, 2020, 12:28 PM IST

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి తిరుపతి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2019 ఫిబ్రవరి 2న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహలకు ఉన్న మూడు బంగారు కిరీటాలను ఇద్దరు నిందితులు చోరీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేయగా... వారిలో ఓ నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడి నేరం అంగీకరించడంతో తిరుపతి రెండవ మున్సిఫ్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

మరో నిందితుడు షేక్ నహీం బెయిల్​పై విడుదలై... విచారణకు హాజరుకాకపోవడంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఇదీ చదవండి:హరితహారం మొక్కలు కోసినందుకు ఈ.3 వేల జరిమానా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details