ప్రమాదవశాత్తు అడ ప్రాజెక్టులో పడి చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో చోటు చేసుకుంది. నీటిలో తేలిన దుప్పిని చూసి ప్రాజెక్టు అధికారులు అటవీ అధికారులకు తెలిపారు. వెంటనే ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ ఘటనా స్థలానికి చేరుకుని దుప్పిని బయటకు తీయించి పంచనామా చేయించారు.
అడ ప్రాజెక్టులో పడి చుక్కల దుప్పి మృతి - deer died fall in aada project
అడ ప్రాజెక్టులో పడి చుక్కల దుప్పి మృతి చెందింది. అధికారులు దుప్పిని బయటకు తీయించి పంచనామా చేయించారు.

అడ ప్రాజెక్టులో పడి చుక్కల దుప్పి మృతి
అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో దుప్పిని దహనం చేశారు. ప్రాజెక్టును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుంచి దుప్పులు వెళ్తున్న సమయంలో ప్రాజెక్టులో పడిపోయి ఉండవచ్చని అధికాారులు తెలిపారు. రాత్రిపూట ఘటన జరగటంతో దుప్పిని రక్షించలేకపోయామన్నారు. ఎవరికైనా ఇటువంటివి కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి:ఆర్మీలో చేరే అర్హత రాలేదని యువకుడు ఆత్మహత్య