తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దీక్షిత్​రెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం - వరంగల్​ నేరవార్తలు

రాష్ట్రంలో సంచలనం రేపిన 11 ఏళ్ల దీక్షిత్​రెడ్డి అపహరణ, హత్యకేసు నిందితుడు మందా సాగర్​ బలవన్మరణానికి యత్నించాడు. ములాఖత్​ అనంతరం స్విచ్​ బోర్డులో చేయి పెట్టాడు. వెంటనే స్పందించిన వరంగల్​ కేంద్ర కారాగార సిబ్బంది.. ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

deekshith murder case accused manda sagar attempted suicide
దీక్షిత్​రెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 2, 2020, 12:59 AM IST

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్​, హత్యకేసు నిందితుడు మందా సాగర్ ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ కేంద్ర కారాగారంలో ఘటన చోటుచేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో మందా సాగర్​ నిందితుడు. ప్రస్తుతం వరంగల్​ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ములాఖత్​లో ఫోన్ మాట్లాడేందుకు వచ్చిన సాగర్.. బ్యారక్​లోకి తిరిగి వెళ్తున్న సమయంలో స్విచ్ బోర్డులో వేలు పెట్టి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే స్పందించిన జైలు సిబ్బంది నిందితుడిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాగర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అక్టోబర్ 18న దీక్షిత్​రెడ్డిని కిడ్నాప్ చేసిన నిందితుడు... అదే రోజు సాయంత్రం కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని దానయ్య గుట్టల వద్ద హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చివేశాడు. అక్టోబర్ 22న చేసిన నేరాన్ని అంగీకరించాడు.

సాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.... తప్పించుకునేందుకు యత్నించాడా.. అనేది పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.

దీక్షిత్​రెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details