మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మందసాగర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారిస్తున్నారు. కృష్ణాకాలనీలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
దీక్షిత్‌రెడ్డిని ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశాడు.. అన్నారం గుట్ట వరకు ఎలా తీసుకెళ్లాడు.. నిందితుడితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. గుట్టపై బాలుడిని చంపిన ప్రదేశం, పరిసరాలను పరిశీలించారు. సాగర్ స్వస్థలం శనిగపురంలోని సాగర్ డెన్‌ను, మహబూబాబాద్‌లోని సాగర్ ఆటోమొబైల్ దుకాణం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు.
కిడ్నాప్ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారో గుర్తుపట్టకుండా ఎలాంటి సాంకేతిక పరికరాలు వినియోగించారు... అనే దానిపైనా ఆరాతీశారు. స్లీపింగ్ టాబ్లెట్లు ఎక్కడ నుంచి తీసుకువచ్చాడనే కోణంలోనూ ప్రశ్నించారు. సాగర్ వినియోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.