సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కంకణాల మహేశ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మహేశ్ తనకున్న ఎకరం 1.5 ఎకరాల పొలంతో పాటు మరో 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. మరోవైపు లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబ పోషణకు, వ్యవసాయానికి చేసిన అప్పులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
విషాదం.. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య - రాయవరంలో వ్యక్తి ఆత్మహత్య వార్తలు
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
గమనించిన కుటుంబ సభ్యులు మహేశ్‌ను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.