వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో ఓ గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. కొంకపాక గ్రామశివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. సుమారు వారం రోజుల క్రితం మహిళ మృతి చెందడం వల్ల గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.
ఎస్సారెస్సీ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
గుర్తుతెలియని మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లా కొంకపాకలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సారెస్సీ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
అది చూసిన కొందరు రైతులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చిందన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పాతబస్తీ హుస్సేని ఆలంలో ఇల్లు కూలి ఇద్దరు మృతి