రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్గూడ వద్ద మంగళవారం రాత్రి వాగు ప్రవాహ ఉద్ధృతికి కారుతో సహా వెంకటేశ్ గౌడ్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో బుధవారం మధ్యాహ్నం వెంకటేశ్ గౌడ్ మృతదేహం లభ్యం కాగా.. గురువారం ఉదయం రాఘవేంద్ర మృతదేహం దొరికింది.
గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం - latest crime news rangareddy district
ఇద్దరు వ్యక్తులు కారుతో సహా వాగులో కొట్టుకెళ్లిన ఘటనలో రెండో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్గూడ వద్ద మంగళవారం రాత్రి వాగు ప్రవాహ ఉద్ధృతికి వెంకటేశ్ గౌడ్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
![గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం deadbody find in water in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9179957-thumbnail-3x2-lashkar.jpg)
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
రాఘవేంద్ర మృతదేహం సాగర్పంప్ ప్రాంతంలోని వంతెన వద్ద గుర్తించిన పోలీసులు.. వెలికి తీశారు. వెంకటేశ్ గౌడ్ స్వస్థలం కందూరు మండలం బేగంపేట కాగా.. రాఘవేంద్ర కందుకూరు మండలం బాచుపల్లికి చెందిన వ్యక్తి. వీరిద్దరు చెరువుగట్టు బయల్దేరి లష్కర్ గూడా వద్ద వాగులో గల్లంతయ్యారు.
ఇదీ చదవండి:చెరువు కత్వాలో పడి బాలుడు మృతి