సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలో రామస్వామి గట్టు వెనుక పొదల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన కడవెండి వీరబ్రహ్మచారిగా పోలీసులు గుర్తించారు.
అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యం - తెలంగాణ వార్తలు
హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన కడవెండి వీరబ్రహ్మచారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల21 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు హుజుర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉదయం వాకింగ్ వెళ్లే వారు చిలుకూరు మండల పరిధిలోని పొదల్లో మృత దేహాన్ని గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చారు.
అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యం
ఈ నెల21 సోమవారం సాయంత్రం తన ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి వీరబ్రహ్మచారి ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ రావడంతో హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల నుంచి ఓ ద్విచక్ర వాహనం చిలుకూరు మండల పరిధిలో ఉండడంతో అనుమానం వచ్చి ఉదయం వాకింగ్ వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెట్ల పొదల్లో మృత దేహాన్ని గుర్తించారు.
ఇదీ చూడండి: రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్.. తప్పిన ప్రమాదం