నాలాలో కొట్టుకు వచ్చిన మృతదేహం... ఎవరిదదీ?
గుర్తు తెలియని మృతదేహం కాలువలో కొట్టుకు వచ్చిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. దానిని బయటకు తీసిన పోలీసులు... శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Dead body found at Canal in warangal district
వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి ఆలయం సమీపంలోని భద్రకాళి నాలాలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో మృతదేహాన్ని కాలువల నుంచి పైకి తీసి శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు నాలా వద్దకు గంపులుగా గుమిగూడారు.