రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ సమీపంలో సాగర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వస్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సాగర్ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు - రంగారెడ్డి సాగర్ రోడ్డులో ప్రమాదం
వనస్థలిపురం ఠాణా పరిధి ఇంజాపూర్ సమీపంలోని సాగర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. కారును డీసీఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సాగర్ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు
మీర్పేట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధాకర్... కుటుంబ సభ్యులతో కలిసి నగరం వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు దాటొచ్చి వీరి కారుని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా... కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వనస్థలీపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆస్తికి అడ్డువస్తాడని: ఏడాది వయసున్న తమ్ముడిని చంపిన అన్న