తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమార్తెలు - తండ్రికి దహనసంస్కారాలు నిర్వహించిన కూతురు

రెండు వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కుమార్తెలే తలకొరివి పెట్టి దహనసంస్కారాలు నిర్వహించారు. కుమారులు లేని లోటు తీర్చి... అంత్యక్రియలు చేపట్టారు.

daughter final funaral to his father
తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తనయ

By

Published : Dec 3, 2020, 10:59 PM IST

మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. ప్రత్తిపాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది జనుపల్లి ప్రసాద్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటంతో దుఃఖాన్నిదిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. గతంలో బార్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రసాద్ బాబు మృతి పట్ల పలువురు న్యాయవాదులు సంతాపం ప్రకటించారు.

విశాఖలో...

మరో ఘటనలో విశాఖ జిల్లా సూరెడ్డిపాలెంలో అనారోగ్యంతో మృతిచెందిన గుంగునాయుడుకి.. కుమార్తె లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేసింది.

ఇవీచూడండి:ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!

ABOUT THE AUTHOR

...view details