సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అదును చూసి అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్ క్రైం పోలీస్టేషన్‌కు బాధితుల క్యూ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే నగరానికి చెందిన నలుగురిని బురిడీ కొట్టించి లక్షల్లో లూఠీ చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెచ్చిపోతున్న సైబర్‌గాళ్లు.. లక్షల్లో లూఠీ - హైదరాబాద్‌లో సైబర్ మోసాలు
అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది.. సైబర్ నేరగాళ్ల వ్యవహారం. బ్యాంకు అధికారుల్లా, ఆన్లైన్ వ్యాపారం పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు రోజురోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
రెచ్చిపోతున్న సైబర్‌గాళ్లు.. లక్షల్లో లూఠీ
బ్యాంక్ అధికారులమంటూ... కేవైసీ అప్డేట్ చేయాలని హైదరాబాద్ వారసిగూడకి చెందిన సాయి నితిన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన మొబైల్‌కి వచ్చిన ఓటీపీ సాయి నితిన్ వారికి చెప్పాడు. తీరా చూస్తే ఖాతా నుంచి రూ.1.05 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో బోరబండకి చెందిన రవి అనే వ్యక్తి నుండి రూ. 50 వేలు కొట్టేశారు. ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు అమ్ముతున్నామంటూ.. జూబ్లీహిల్స్‌కి చెందిన పవన్ కుమార్ రూ.1.30 లక్షలు, సుల్తాన్ బజార్‌కి చెందిన సుభాష్ రూ. 50 వేల లూఠీ చేశారు.