తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యూఎస్ కంపెనీ పేరుతో గాలం.. రూ.52 లక్షల మోసం - సైబర్ నేరగాళ్లు

రాష్ట్రంలో సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక పద్ధతిలో మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్​లో యూఎస్ కంపెనీ పేరుతో సైబర్​ నేరగాళ్లు మోసానికి తెగపడ్డారు. నకిలీ ఈమెయిల్​ ద్వారా రూ.52 లక్షలు కాజేశారు.

cybercriminals cheats to granite in Hyderabad
యూఎస్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం

By

Published : Oct 10, 2020, 11:07 AM IST

హైదరాబాద్​కు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే సంస్థ సౌత్ అమెరికాకు చెందిన కంపెనీతో ఆన్‌లైన్ వ్యాపారం చేస్తోంది. యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ ఖాతా తెరిచిన నిందితులు.. ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామంటూ పోకర్ణ గ్రానైట్ కంపెనీకి ఈమెయిల్ చేశారు. మెటీరియల్​ పంపినందుకు 59 వేల యూరోలు (రూ.52 లక్షలు) పంపించాలని కోరారు.

ఇది నమ్మిన పోకర్ణ గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఎప్పటిలాగానే ఈమెయిల్‌లో ఉన్న అకౌంట్‌లోకి రూ.52 లక్షలు బదిలీ చేశారు. చాలా రోజుల వరకు మెటీరియల్ రాకపోవడం వల్ల నకిలీ ఈమెయిల్‌గా గుర్తించిన కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు.. 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details