తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ముంచుతున్న పండుగ ఆఫర్స్​... సైబర్ నేరగాళ్లతో బీకేర్​ఫుల్ - latest cyber crime cases in vijayawada

రాబోయే పండుగలను ఆసరాగా మార్చకుంటున్నారు సైబర్​ నేరగాళ్లు. ఆఫర్ల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల మెుబైల్స్​ను ఇస్తామని ఆశ చూపి... చివరికి పీచు మిఠాయి పంపి పిచ్చి వాళ్లను చేస్తున్నారు.

cyber crime
cyber crime

By

Published : Oct 10, 2020, 7:49 PM IST

దసరా, దీపావళి పండుగలు అనగానే సంబురాలతో పాటు భారీ ఆఫర్లు ప్రజలను ఊరిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా మార్చుకున్నారు సైబర్ నేరగాళ్లు. రానున్న ఈ పండుగలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల మెుబైళ్లను అందిస్తామని నమ్మించి దోచుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏకంగా ఒకే రోజు ఐదుగురికి సెల్​ఫోన్ బదులు పీచు మిఠాయి పంపి మోసగించారు.

అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్​ దొరబాబుకి 2 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కేవలం రూ.1,700కే ప్రముఖ కంపెనీ ఫోన్ ఇస్తామని చెప్పడంతో అడ్రస్ చెప్పాడు. తపాలా కార్యాలయంలో నగదు చెల్లించి బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఫోన్​కు బదులు పీచు మిఠాయి కనబడటంతో బాధితుడు లబోదిబో అన్నాడు. ఒకేరోజు ఐదుగురు మోసపోవడంతో తపాలా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి మోసగాళ్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:మరోసారి భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

ABOUT THE AUTHOR

...view details