సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక నేరాలు 42 శాతం పెరిగాయని పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. వార్షిక నేర గణాంకాలను విడుదల చేసిన ఆయన..కమిషనరేట్లో సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయన్నారు. సంవత్సరం మొత్తంగా 6.65 శాతం నేరాలు తగ్గినట్లు సీపీ పేర్కొన్నారు.
సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయి: సీపీ సజ్జనార్ - telangana crime news
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర గణాంకాలను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. సైబర్ నేరాలు 135 శాతం, ఆర్థిక నేరాలు 42 శాతం పెరిగినట్లు తెలిపారు.
సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయి: సీపీ సజ్జనార్
రహదారి ప్రమాదాలు 22.7 శాతం, మహిళలపై నేరాలు 18.6 శాతం తగ్గాయన్నారు. చిన్నారులపై నేరాలు 12.2 శాతం, హత్యలు, దోపిడీలు 26 శాతం.. హత్యాయత్నం కేసులు 30 శాతం తగ్గాయని సీపీ వెల్లడించారు. అత్యాచారం కేసులు 33 శాతం తగ్గాయన్న సజ్జనార్.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.