హైదరాబాద్ మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్‌లో ఇటీవల చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో జరిగిన ఈ చోరీలో 119 సెల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు... ఈ కేసులో ముంబయికి చెందిన మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అపహరించిన మొబైల్స్‌ను ఒఎల్‌ఎక్స్‌లో అమ్ముతున్నట్టు తెలిపారు.
దుకాణాల్లో చోరీ చేసి ఒఎల్‌ఎక్స్‌లో అమ్ముతున్నారు: సజ్జనార్ - అంతర్ రాష్ట్ర దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టిన సజ్జనార్
హైదరాబాద్ మియాపూర్‌లో చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు గతంలోనూ పలు దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ సజ్జనార్ వెల్లడించారు.
దుకాణాల్లో చోరీ చేసి ఒఎల్‌ఎక్స్‌లో అమ్ముతున్నారు: సజ్జనార్