తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​లో వీసా... రూ. 53 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయత్వమే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆన్​లైన్​ వీసా పేరిట ఓ యువకుడిని నిండా ముంచేశారు.

ఆన్​లైన్​లో వీసా... రూ. 53 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ఆన్​లైన్​లో వీసా... రూ. 53 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

By

Published : Oct 26, 2020, 6:12 PM IST

సైబర్ నేరగాళ్లను నమ్మి రూ. 53 లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్​ మూసాపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి. మూసాపేటకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం యత్నిస్తున్నాడు. అందుకోసం ఆన్​లైన్​లో అన్వేషించాడు.

అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి వీసా కావాలని సంప్రదించాడు. వీసా ఇప్పిస్తామని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు... బాధితుడి నుంచి దశలవారీగా రూ. 53 లక్షలు వసూలు చేశారు. వీసా రాకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన బాధితుడు... సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇంకొన్ని...

ఓఎల్ఎక్స్​లో కారు అమ్ముతామంటూ ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించిన మరో వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2.50 లక్షలు కాజేశారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 10 లక్షల వరకు పెంచుతామంటూ మరో వ్యక్తి నుంచి రూ. 1.50 లక్షలు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్.రమణ

ABOUT THE AUTHOR

...view details