తక్కువ ధరకే టూవీలర్ వాహనం వస్తుందని నమ్మి ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఓఎల్ఎక్స్‌లో ఫొటోలు చూసి.. లక్షా నాలుగు వేల రూపాయలను... సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సతీశ్, బజార్ ఘాట్‌కు చెందిన జమీల్ అనే ఇద్దరు వ్యక్తులు బదిలీ చేశారు.
ఓఎల్ఎక్స్లో ఫొటోలు పెట్టి... రూ.లక్ష దండుకున్నారు - హైదరాబాద్‌లో సైబర్ నేరాలు
సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకోవడానికి కొత్త కొత్త ఉపాయాలు పన్నుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరలకు వాహనాలు అమ్ముతామంటూ ఫొటోలు పెట్టి బురిడికొట్టిస్తున్నారు. ఆ ఫొటోలు చూసి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లక్షా నాలుగు వేల రూపాయలు మోసపోయారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
cyber cheating
వాహనం రాక పోవడం... ఫోన్ చేసినా స్పందించకపోవడంతో... మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్