ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని నమ్మిన వారిని సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచేస్తున్నారు. హైదరాబాద్‌లోని మూసాపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం యత్నిస్తున్నాడు. దానికోసం ఆన్లైన్లో అన్వేషించాడు. అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి వీసా కావాలని సంప్రదించాడు. వీసా ఇప్పిస్తామని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి దశల వారీగా డబ్బు వసూలు చేసి మొత్తంగా రూ.53 లక్షలు కాజేశారు. ఎన్ని రోజులైనా వీసా రాకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
వీసా ఇప్పిస్తామని చెప్పి రూ.53 లక్షలు కాజేశారు...!
డబ్బులు దోచుకునేందుకు ఏ చిన్న మార్గాన్ని సైబర్ నేరగాళ్లు వదులుకోవట్లేదు. వీసా కోసం ప్రయత్నిస్తున్న ఓ యువకున్ని సైబర్ నేరగాళ్లు నిలువుగా దోచేశారు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు వీసా ఇప్పిస్తామని నమ్మబలికి ఏకంగా రూ.53 లక్షలను కాజేశారు.
వీసా ఇప్పిస్తామని చెప్పి రూ.53 లక్షలు కాజేశారు...!
ఓఎల్ఎక్స్లో కారు అమ్ముతామంటూ ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించిన వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రెండున్నర లక్షలు కాజేశారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి... క్రెడిట్ కార్డు లిమిట్ పది లక్షల వరకు పెంచుతామంటూ మరో వ్యక్తి నుంచి లక్షన్నర వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.