సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులమంటూ ఓ వ్యక్తికి ఫోన్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయాలని సూచించారు. కేటుగాళ్లు చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్... తన వద్ద ఉన్న రెండు బ్యాంకుల ఏటీఎం కార్డు వివరాలను ఎంట్రీ చేశారు.
బ్యాంక్ అధికారులమంటూ రూ.10 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు - Hyderabad cyber crime cases latest news
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంక్ అధికారులమంటూ ఓ వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలను కాజేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

Hyderabad latest news
ఇంకేముంది హైదరాబాద్ తార్నాకకు చెందిన సుబ్బరాయుడు అనే కస్టమర్ అకౌంట్ నుంచి 10 లక్షల నగదు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.