ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని తన స్నేహితుడికి మెయిల్ చేశారు. నిజమే అనుకొని వారు పంపించిన బ్యాంక్ ఖాతాలో అతను 50 వేల రూపాయలు జమ చేశాడు.
ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు దోచిన సైబర్ నేరగాళ్లు - Hyderabad Cyber crime cases latest news
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి మోసం చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని తన స్నేహితుడికి సందేశాలు పంపి గుట్టుచప్పుడు కాకుండా 50 వేల రూపాయాలు దోచేశారు.
Hyderabad cyber crime latest news
మరుసటి రోజు ఏం జరిగిందని స్నేహితుడు అడగడం వల్ల అసలు విషయం బయట పడింది. తన మెయిల్ హ్యాక్ చేసి చీటింగ్ పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తార్నాకకు చెందిన జేజే బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.