హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి నగర శివారు ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు, ఐసీఐసీఐ, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నారు. కాగా తాము స్టాండర్డ్ చార్డెట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
మీ క్రెడిట్ కార్డుకు రివార్డ్ పాయింట్లు వచ్చాయి. వాటిని మీ ఖాతాలో జమ చేసుకోవాలంటే ప్రాసెస్ ఉందని... మీరు వివరాలు చెబితే మేం పూర్తి చేస్తామంటూ చెప్పగా... ప్రొఫెసర్ కేటుగాళ్ల మాటలు నమ్మేశారు. అడిగినట్లుగా కార్డు వివరాలు, సీవీవీ నంబర్‌తో సహా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుందని... అందులో ఉండే నంబర్ చెబితే ప్రాసెసింగ్ పూర్తవుతుందని సూచించగా సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను చెప్పేశాడు. ఒక్కసారి కాదు ఏకంగా 15సార్లు తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పేశారు.