తమ వద్ద మదుపు చేస్తే నెలకు నూటికి రూ.5 నుంచి రూ.10 వడ్డీ ఇస్తామంటూ మోసం చేస్తూ 13 నెలల్లో రూ.13 కోట్లు కొల్లగొట్టిన దంపతులు పీట పద్మజ, పీట వరప్రసాద్‌ను హైదరాబాద్ సీసీఎస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. మోతీనగర్‌లో ఉంటున్న ఈ నిందితులపై 20 మంది ఫిర్యాదు చేశారని, విచారణ అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని ఇన్‌స్పెక్టర్ కె.వి.సూర్యప్రకాష్ అన్నారు.
వడ్డీ ఇస్తామంటూ 13 నెలల్లో రూ.13 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు - వడ్డీ ఇస్తామంటూ మోసం చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్
హైదరాబాద్‌లో ప్రారంభించిన స్వధాత్రి ఇన్‌ఫ్రాలో ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు.. తమ వద్ద మదుపు చేస్తే నెలకు నూటికి రూ.5 నుంచి రూ. 10 వరకు వడ్డీ ఇస్తామంటూ ఇప్పటివరకు రూ. 13 కోట్లు కొల్లగొట్టిన వారిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
![వడ్డీ ఇస్తామంటూ 13 నెలల్లో రూ.13 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు 13 crores crime by cyber criminals in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8517135-565-8517135-1598099131119.jpg)
వడ్డీ ఇస్తామంటూ 13 నెలల్లో రూ.13 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
ఈ దంపతులు సినిమాల నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. విజయవాడకు చెందిన ఘరానా మోసగాడు యార్లగడ్డ రఘు హైదరాబాద్‌లో ప్రారంభించిన స్వధాత్రి ఇన్‌ఫ్రాలో సైతం ఏజెంట్లుగా చేరారు. రఘు రూ.కోట్లు స్వాహా చేస్తున్నాడని గ్రహించారు. స్వధాత్రిలో అంతర్భాగమైన రుణధార సంస్థకు డైరెక్టర్లు తామేనని మదుపరులను నమ్మించారు. తీసుకున్న సొమ్ముకు నకిలీ రసీదులిచ్చేవారన్నారు.
ఇదీ చూడండి:'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'