తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేట్రేగుతున్న సైబర్​ నేరగాళ్లు.. వివిధ కేసుల్లో రూ. 8లక్షలు స్వాహా - Olx cyber Crime latest News

హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎన్ని సూచనలు ఇస్తోన్నా... ఎంత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా ప్రతిరోజు ఎక్కడో చోట ఆన్లైన్ మోసాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా వివిధ రూపాల్లో నగరంలోని పలువురు బాధితుల నుంచి లక్షల్లో సొమ్ము దోచుకున్నారు.

పేట్రేగుతున్న సైబర్​ నేరగాళ్లు.. వివిధ కేసుల్లో రూ. 8లక్షలు స్వాహా
పేట్రేగుతున్న సైబర్​ నేరగాళ్లు.. వివిధ కేసుల్లో రూ. 8లక్షలు స్వాహా

By

Published : Sep 15, 2020, 9:09 AM IST

సైబర్ నేరగళ్ల ఉచ్చులో పడుతున్న అమాయక ప్రజలు వివిధ కారణాలతో ఆర్థిక దోపిడీలకు గురవుతున్నారు. నగరంలోని పలువురు బాధితులను నమ్మిస్తూ సైబర్ క్రిమినల్స్ సుమారు రూ. 8 లక్షలను దండుకున్నారు.

జియో మార్ట్ పేరిట..

జియో మార్ట్ పేరుతో ఓ బాధిత వ్యక్తి వద్ద లక్ష రూపాయలను మోసం చేశారు. ఒఎల్​ఎక్స్ పేరుతో 2 లక్షలు.. ఓటీపీ, కేవైసీ పేరుతో 10 మంది నుంచి 5 లక్షల రూపాయలను సైబర్ దొంగలు కాజేశారు.

దిల్లీలో డబ్బులు డ్రా..

ఓ వ్యక్తి డెబిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు దిల్లీలో డబ్బులు డ్రా చేసుకుని మోసం చేశారు. వీటితో పాటు ఆన్లైన్ డేటింగ్ పేరుతో ఓ మహిళను ఆగంతుకుడు వేధించాడు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయగా... కేసులు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి : 'జూబ్లీహిల్స్ పీఎస్​ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్'

ABOUT THE AUTHOR

...view details