తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'కేవైసీ అప్​డేట్​ అంటూ ఫోన్.. నిజమో కాదో తెలుసుకోండి' - cyber crimes using kyc update increasing in hyderabad

కేవైసీ అప్​డేట్ చేయాలంటూ ఫోన్ చేసి... లింక్​ల ద్వారా సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఆన్​లైన్ మోసాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

cyber crimes using kyc update increasing in hyderabad
'కేవైసీ అప్​డేట్​ అంటూ ఫోన్.. నిజమో కాదో తెలుసుకోండి'

By

Published : Jul 22, 2020, 6:22 PM IST

రోజురోజుకు సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్​డేట్ పేరుతో ఓ యువతి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ. 79 వేలు టోకరా వేశారు. హైదరాబాద్​ లక్డీకాపూల్​కు చెందిన నిఖితకు ఓ ఫోన్​ వచ్చింది. తాము కొటక్ మహేంద్ర బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. కేవైసీ అప్​డేట్ చేయాలంటూ ఖాతా వివరాలు తీసుకుని రూ. 79 వేలు కాజేశారు.

మరో ఘటనలో హైదరాబాద్​ సైదాబాద్​కు చెందిన అఖిలాష్​ ఓఎల్ఎక్స్ ద్వారా బైక్ కొనేందుకు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 41 వేలు పోగొట్టుకున్నారు. ఇద్దరు బాధితులు వేర్వేరుగా సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆన్​లైన్​లో కొనుగోళ్లు జరిపినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సీసీఎస్ పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:లేహ్​ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details