తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బినామీ ఖాతా తీగలాగితే.. సైబర్‌ నేరగాళ్ల గుట్టురట్టు - cyber crimes increased in name of binami

సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బీమా సొమ్ముకు బోనస్‌ ఇస్తాం.. తక్కువ వడ్డీకే రుణం ఇస్తాం.. అంటున్న వారి మాటలు నమ్మి బినామీ ఖాతాల్లో నగదు జమచేస్తూ చాలామంది బాధితులుగా మిగిలిపోతున్నారు. బాధితుల నుంచి జమ చేసుకున్న నగదును ఈ-వ్యాలెట్‌లోకి, లేకపోతే తమ బినామీ ఖాతాలకు సైబర్‌ నేరస్థులు మళ్లిస్తున్నారు.

cyber crimes increased in name of binami
బినామీ ఖాతా తీగలాగితే.. సైబర్‌ నేరగాళ్ల గుట్టురట్టు

By

Published : Jun 22, 2020, 7:20 AM IST

Updated : Jun 22, 2020, 10:12 AM IST

మీరు క్రెడిట్‌ కార్డు వినియోగిస్తున్నారా? పేటీఎం, గూగుల్‌పే మొబైల్‌ యాప్‌లున్నాయా? మీ డెబిట్‌ కార్డులు అప్‌డేట్‌ చేస్తాం.. బీమా సొమ్ముకు బోనస్‌ ఇస్తాం.. తక్కువ వడ్డీకే రుణం ఇస్తాం.. అంటూ మెయిల్‌ ద్వారా గానీ, ఫోన్‌ ద్వారా గానీ మాట్లాడుతున్నది సైబర్‌ నేరస్థులే. వారి మాటలు నమ్మి బినామీ ఖాతాల్లో నగదు జమచేస్తూ చాలామంది బాధితులుగా మిగులుతున్నారని పోలీస్‌ అధికారులు అంటున్నారు. బాధితుల నుంచి జమ చేసుకున్న నగదును ఈ-వ్యాలెట్‌లోకి, లేకపోతే తమ బినామీ ఖాతాలకు సైబర్‌ నేరస్థులు మళ్లిస్తున్నారు.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో..

లాటరీలో రూ.25 లక్షల బహుమతి అంటూ మోసం చేసిన సైబర్‌ నేరస్థుడు రూ.లక్షల్లో కొల్లగొట్టి.. నగదును తన బినామీ ఖాతాల్లోకి జమ చేయించుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ ఖాతాలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడులో ఉన్నట్లు తెలిసింది. ఇటువంటి సైబర్‌ నేరస్థుల బినామీ ఖాతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

బినామీ ఖాతాల వివరాలే కీలకం

ఆన్‌లైన్‌ మోసాలు, నైజీరియన్ల మోసాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌ నంబర్లు తెలుసుకుని నగదు స్వాహా.. తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, అంతరాష్ట్ర ముఠాలను గుర్తించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు దిల్లీ, ముంబయి, గుర్‌గ్రామ్‌లలో ఉంటున్న వారి కదలికలను రహస్యంగా గమనిస్తున్నాయి.

వేగంగా స్పందిస్తేనే..

బ్యాంకుల ద్వారా అంతరాష్ట్ర ముఠాల కార్యకలాపాలను కట్టడి చేస్తే స్వాహా చేసిన సొమ్ములో యాభై శాతం నగదును వారి ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు. బాధితులకు ఫోన్‌ చేసిన వెంటనే నేరస్థులు పలానా ఖాతాలో సొమ్ము జమ చేయమంటూ చెబుతారు. వారు ఆ ఖాతాలో నగదు జమ చేయగానే.. కొద్ది గంటల వ్యవధిలో ఏటీఎం ద్వారా సొమ్మును విత్‌డ్రా చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బాధితుడు జమ చేసిన ఖాతా ఎప్పుడు ప్రారంభమైంది? చిరునామా ఎవరిది? ఫోన్‌ నంబర్లు ఎన్ని ఉన్నాయి? ఏ ఏటీఎం కేంద్రంలో విత్‌డ్రా చేసుకున్నాడన్న వివరాలను బ్యాంకు అధికారుల వేగంగా పోలీసులకు ఇస్తే వెంటనే వారిని పట్టుకునే వీలుంటుంది.

పిన్‌, ఓటీపీ నంబర్లు తీసుకుని నగదు స్వాహా చేసే మోసగాళ్లు బాధితుల ఖాతాల్లోంచి కొల్లగొట్టిన డబ్బును ఈ-వ్యాలెట్లు, మొబైల్‌ యాప్‌లలోకి బదిలీ చేస్తున్నారు. వీటిని ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారన్న అంశాలపై ఆన్‌లైన్‌ద్వారా తెలుసుకుని లావాదేవీలను స్తంభింపజేసే అవకాశాలున్నాయి.

Last Updated : Jun 22, 2020, 10:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details