కొంతమంది ప్రముఖుల వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీని గురించి తెలుసుకునేందుకు సైబర్ క్రైం పోలీసులను సంప్రదించగా బ్యాంకింగ్ మోసాలు జరిగినట్లుగానే ఏమరపాటుగా ఉండి.. ఓటీపీ చెప్తే వాట్సాప్‌ను హ్యాక్ చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు. సైబర్ క్రైం పోలీసులు తరచుగా చెబుతున్నట్లు వాట్సాప్ ఖాతాకు సంబంధించిన ఓటీపీని ఎవ్వరికీ చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రముఖుల వాట్సాప్ హ్యాక్!.. పోలీసులు ఏం చెప్పారంటే.. - సెలబ్రిటీల వాట్సాప్ హ్యాక్ వార్తలు
ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అవుతున్నట్లు తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని సైబర్ క్రైం పోలీసులు వివరించారు. వాట్సాప్‌కు సంబంధించిన ఆరు అంకెల ఓటీపీని ఎవ్వరికీ చెప్పనంత వరకు వినియోగదారులు సురక్షితంగా వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
ప్రముఖుల వాట్సాప్ హ్యాక్!.. పోలీసులు ఏం చెప్పారంటే..
వాట్సాప్ వినియోగదారులు ప్లేస్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని ఇన్స్టాల్ చేసుకునే సమయంలో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పకుండా, లింక్‌ను తెరవనంత వరకు సైబర్ నేరగాళ్లు వినియోగదారుని వాట్సాప్‌ను హ్యాక్‌చేసే అవకాశమే లేదని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఆ ఛాలెంజ్‌లకు దూరంగా ఉండండి : సైబరాబాద్ పోలీసులు