తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రుణ యాప్​లపై దర్యాప్తు ముమ్మరం... అదుపులో నలుగురు - తెలంగాణ వార్తలు

రుణ యాప్‌లపై దర్యాప్తు మరింత ముమ్మరం చేసిన సైబర్‌ క్రైం పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్బీఐ, ఎన్బీఎఫ్​సీ నిబంధనలు విరుద్ధంగా ఉన్న మూడు సంస్థలను గుర్తించారు.

cyber-crime-police-focus-on-online-apps-for-loans
రుణ యాప్​లపై దర్యాప్తు ముమ్మరం... పోలీసుల అదుపులో నలుగురు

By

Published : Dec 22, 2020, 1:17 PM IST

సెల్‌ఫోన్‌ రుణ యాప్‌లపై హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంత మంది నిర్వాహకులు 60శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది నిబంధనలకు విరుద్ధమని సైబర్ క్రైం పోలీసులు భావిస్తున్నారు.

ఆర్​బీఐ, ఎన్​బీఎఫ్​సీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రుణ సంస్థలను ఇప్పటికే మూడింటిని గుర్తించారు. దాదాపు 40 అప్లికేషన్ల ద్వారా రుణాలు ఇస్తున్నట్లు తేల్చారు. వాటిపై దాడులు చేసి నలుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 40, సైబరాబాద్‌లో 120, రాచకొండలో 60కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.

ఇదీ చూడండి:మైక్రోఫైనాన్స్‌ యాప్​ల వేధింపులు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ABOUT THE AUTHOR

...view details