తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు... తస్మాత్​ జాగ్రత్త! - Hyderabad cyber crime cases latest news

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్ల మాయాజాలాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి వేల రూపాయలు దోచేస్తున్నారు. నిన్న సైబర్​ క్రైమ్​ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.

Hyderabad cyber crime cases latest news
Hyderabad cyber crime cases latest news

By

Published : May 1, 2020, 2:03 PM IST

సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. గురువారం హైదరాబాద్​ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.

  • న్యూ బోయిగూడకు చెందిన ఓ యువతి వాక్యూమ్‌ క్లీనర్‌ను అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి వస్తువు తీసుకుంటానన్నాడు. క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే ఖాతాలో డబ్బు జమవుతుందని చెప్పడం వల్ల అలానే చేసి ఆ యువతి రూ.40 వేలు పోగొట్టుకుంది.
  • నగరానికి చెందిన ఓ వ్యక్తికి తన సంస్థ యజమాని పేరుతో మెయిల్‌ వచ్చింది. రూ.27,700 కావాలని అందులో ఉండడం వల్ల పంపించాడు. రెండురోజుల తర్వాత మరో మెయిల్‌ రావడంతో యజమానికి ఫోన్‌ చేయగా, మోసం బయటపడింది.
  • పురానాపూల్‌కు చెందిన ఓ వ్యక్తి మాస్కులు అమ్మేందుకు జస్ట్‌ డయల్‌ యాప్‌లో ప్రకటన ఇచ్చాడు. పెద్ద మొత్తంలో మాస్కులు కావాలని, ముందుగా నగదు చెల్లిస్తానని ఓ వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. స్కాన్‌ చేయగానే ఖాతాలోని రూ.55 వేలు మాయమయ్యాయి.
  • జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ కారు డ్రైవర్‌ ఫేస్‌బుక్‌లో ద్విచక్ర వాహన ప్రకటన చూసి సంప్రదించగా, వివిధ ఛార్జీల పేరిట క్యూఆర్‌ కోడ్‌లు పంపి రూ.78 వేలు లూటీ చేశారు.
  • లాలాపేటకు చెందిన ఓ వ్యక్తి క్వికర్‌ యాప్‌లో బైకు ప్రకటన చూసి ఫోన్‌ చేశాడు. అవతలి వ్యక్తి ఆర్మీ జవానుగా పరిచయం చేసుకొని వాహనం బయటకు రావాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రూ.35 వేలు కాజేశాడు.

ABOUT THE AUTHOR

...view details