తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దేవుడి కానుక అని నమ్మించి.. 12 లక్షలు కాజేశాడు!

విదేశాల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ సమాచారాన్ని నిజమని నమ్మి ఓ వ్యక్తి రూ.12 లక్షల 85 వేలను అతని ఖాతాలో డిపాజిట్ చేశాడు. తర్వాత తెలిసింది మోసపోయానని.. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.

cyber-crime-happend-in-kadapa-district
దేవుడి కానుక అని నమ్మించి.. 12 లక్షలు కాజేశాడు!

By

Published : May 29, 2020, 11:21 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన కిశోర్‌కుమార్ పాస్టర్. కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి రోజ్ విలియం అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్​తో పాటు సమాచారం వచ్చింది. మీ చర్చికి కానుక ఇవ్వాలనుకుంటున్నానని.. 2 రోజుల్లో మీకు ఒక పార్సిల్ వస్తుందని చెప్పాడు. పార్సిల్ ఇచ్చేవారు చెప్పినట్లు చేయాలని తెలిపాడు. పార్సిల్​లో విదేశీ కరెన్సీ ఉందని.. 40 వేల బ్రిటిష్​ పౌండ్లని భారత్​ కరెన్సీ ప్రకారం.. రూ.35 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పాడు. ఇది దేవుని కానుక వదులుకోవద్దని సూచించాడు.

ఇండియన్ కరెన్సీగా మారాలంటే కొంత డబ్బులు చెల్లించాలని కిశోర్‌కుమార్​ను నమ్మించాడు. దేవుడు పంపే కానుక అని చెప్పేసరికి.. నాలుగు విడతలుగా 12 లక్షల 85 వేల రూపాయలను పాస్టర్ డిపాజిట్ చేశాడు. తర్వాత తెలిసింది మోసపోయానని. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీచూడండి:అందంతో ఎరవేసి.. ప్రవాసుడి వద్ద రూ. లక్షలు కొల్లగొట్టారు

ABOUT THE AUTHOR

...view details