హైదరాబాద్‌లో నమోదైన వివిధ కేసుల్లో రూ.13 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మియాపూర్‌లో నివాసముంటున్న అప్పలనాయుడు చరవాణికి ఈనెల 11న కేవైసీని అప్‌డేట్ చేయాలని.... లేకపోతే సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని కేటుగాళ్లు సందేశం పంపారు. వినియోగదారుడి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. ఆ తర్వాత వెంటనే ఈ-సిమ్ కార్డు అందిస్తామని అవతలి వ్యక్తి బుకాయించాడు. సిమ్ బ్లాక్ కావడంతోపాటు ఈ-సిమ్ కార్డు సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళింది.
ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి సైబర్ నేరగాడు గూగుల్ వ్యూ ఫామ్ పంపించి అందులో బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సిందిగా సూచించాడు. ఖాతా వివరాలు, ఈ-సిమ్ కార్డు సేకరించిన సైబర్ నేరగాడు.. అతని ఖాతాల నుంచి వెంటనే రూ.తొమ్మిది లక్షలకుపైగా నగదును డ్రా చేసుకున్నాడు.
గచ్చిబౌలికి చెందిన కిషోర్ మిశ్రాకు ఈనెల 10న ఇలాంటి సందేశమే రాగా.. సూమారు రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. సురేశ్ అనే మరో వ్యక్తి కూడా 2రోజుల క్రితం... ఈ తరహాలోనే రూ.లక్ష మోసపోయాడు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కి చెందిన ఓ మహిళకు గిఫ్ట్ వచ్చిందని రూ.6.50 లక్షలు ఆన్‌లైన్ ద్వారా దండుకున్నారు.