తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బ్యాంకు అధికారినంటూ టోకరా​.. లక్షా 90వేలు మాయం - hyderabad news

ఓ వ్యక్తికి బ్యాంక్​ అధికారినంటూ ఫోన్​ చేశాడు. మాయమాటలు చెప్పి... మొత్తానికి ఖాతాలోంచి లక్షా 90వేలు కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పరిధిలో చోటుచేసుకుంది.

cyber-crime-at-hyderabad
బ్యాంకు అధికారినంటూ టోకరా​... లక్షా 90వేలు మాయం

By

Published : Jul 15, 2020, 3:57 PM IST

న్యూజిలాండ్​కు చెందిన డేవిడ్​ జార్జ్​ హగ్​ కొన్నేళ్లుగా జూబ్లీహిల్స్​లో ఉంటున్నారు. ఆయనకు యాక్సిస్​ బ్యాంక్​లో ఖాతా ఉంది. కొద్ది గంటల్లోనే మీ క్రెడిట్​ కార్డు రద్దు కాబోతోందంటూ... ఓ వ్యక్తి అతనికి ఫోన్​ చేశాడు. వెంటనే కార్డును అప్​డేట్​ చేసుకోవాలని నమ్మించాడు.

కార్డు నంబర్​, ఓటీపీ చెప్పండంతో జార్జ్​ ఖాతాలోంచి లక్షా 90వేలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నేడు 15వ 'భారత్​-ఈయూ' సదస్సు.. మోదీ హాజరు

ABOUT THE AUTHOR

...view details