సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ తరుచూ షాప్ క్లూస్ సైట్, యాప్ల నుంచి చీరలు తదితరాలు కొనుగోలు చేసేవారు. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో మీకు కారు వచ్చిందంటూ చెప్పారు. కారు కావాలా... లేక దాని విలువను నగదు రూపంలో తీసుకుంటారా అంటూ అడిగారు. తనకు నగదే కావాలంటూ బాధితురాలు చెప్పింది. అయితే ముందుగా కొన్ని ఫీజులు చెల్లించాల్సిన డబ్బు మీ ఖాతాలో రీఫండ్ అవుతాయని నమ్మబలికారు. ఇలా ఆమె నుంచి రూ. 5.7 లక్షలు మోసం చేశారు.
లక్కీ డ్రా పేరుతో... లక్షల రూపాయలు టోకరా - latest cyber crime in hyderabad
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో రూటు మార్చి సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు. లక్కీ డ్రా, ఏటీఎం కార్డు కేవైసీ చేసుకోవాలని నమ్మబలుకుతూ... రూ. లక్షల్లో కాజేశారు. బాధితులు ఫిర్యాదుతో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి.
మరోపక్క రుణం ఇప్పిస్తామంటూ ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు... నగరానికి చెందిన ఓ వ్యక్తిని నమ్మించారు. అతడు ఆసక్తి చూపడం వల్ల ప్రాసెసింగ్ సహా ఇతర ఛార్జీల పేరుతో రూ. 80వేలు కాజేశారు. నగరానికి చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు, కేవైసీ అప్ డేట్ చేయాలని చెప్పారు. ఈ పేరుతో అతడి నుంచి కార్డు వివరాలు, ఓటీపీ తెలుసుకుని 80వేల రూపాయలు స్వాహా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..