పోలీసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీఐడీ అదనపు ఎస్పీ నాగరాజ్ కుమార్, సీసీఎస్ ఏసీపీ రవీందర్ రెడ్డి, మహంకాళి ఇన్ స్పెక్టర్ కావేటి శ్రీనివాసులపై సైబర్ నేరగాళ్లు నకిలీ ఎఫ్బీ ఐడీలు తయారు చేశారు.
వాటి ఆధారంగా.. వారి స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేసి.. తమ వారికి అత్యవసరంగా డబ్బులు కావాలంటూ రూ. 5 నుంచి 10 వేలు అడుగుతున్నారు. అయితే తక్కువ మొత్తం కావడం వల్ల పలువురు.. సైబర్ నేరగాళ్లు ఇచ్చే బ్యాంకు ఖాతాలకు పంపిస్తున్నారు. మరికొందరు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు పంపిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు.. రాజస్థాన్, కోల్ కతా, ఒడిశా ప్రాంతాలకు చెందినవిగా తేలింది.