సిమ్ స్వైప్ చేసి ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 19లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. సికింద్రాబాద్‌కు చెందిన ఆనంద్ స్థానికంగా ఓ ఎలక్ట్రికల్ కంపెనీ నడిపిస్తున్నాడు. ఈనెల 6న సిమ్‌కార్డు బ్లాక్ అవడం వల్ల సమీపంలో ఉన్న కస్టమర్‌కేర్‌ను సంప్రదించాడు. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చని మరుసటి రోజుకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం వల్ల ఇంటికి వెళ్లిపోయాడు.
సిమ్‌కార్డు స్వైప్ చేసి రూ.19 లక్షలు స్వాహా... - హైదరాబాద్‌లో సైబర్ క్రైం మోసాలు
సిమ్ స్పైప్ చేసి రూ.19 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఆనంద్ అనే వ్యాపారవేత్త ఖాతా నుంచి సొమ్ము కొట్టేశారు.
సిమ్‌కార్డు స్వైప్ చేసి రూ.19 లక్షలు స్వాహా...
తిరిగి వచ్చేసిన సమయంలో సిమ్ విషయం మరచిపోయాడు. మంగళవారం తన ఖాతాలో నగదు పోయిన విషయం గ్రహించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:డోర్నకల్‌లో అంతర్రాష్ట్ర పేకాట రాయుళ్లు అరెస్ట్