హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి బ్యాంకు అధికారులమంటూ సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేయకుంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెట్టారు. కేవైసీ పేరుతో ఆయన నుంచి కార్డు వివరాలు, ఓటీపీ పంపించమని చెప్పి ఖాతాలో ఉన్న రూ. 3 లక్షలు కాజేశారు.
బేగంబజార్‌కు చెందిన మరో యువకుడికి లాటరీ పేరుతో ఎర వేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుడు ఆసక్తి చూపడం వల్ల వివిధ ఫీజుల పేరు చెప్పి దఫా దఫాలుగా రూ. 2.6 లక్షలు స్వాహా చేశారు. ఆన్లైన్లో డ్రస్ మెటీరియల్ ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.3 లక్షలు పోగొట్టుకుంది. రుణం అవసరమైన ఓ నగర వాసి దాని కోసం ఆన్లైన్లో ప్రయత్నించాడు. రూ. లక్ష రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సైబర్ నేరగాళ్లు ఫీజుల పేరుతో అంతే మొత్తం స్వాహా చేశారు.