తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబర్‌ మోసం: బహుమతుల పేరిట రూ. 20 లక్షల దోపిడీ - సైబర్‌ నేరస్థుల మోసాలు

విదేశాల నుంచి కానుకల పేరిట ఓ బాధితుడు రూ. 20 లక్షలు పోగొట్టుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

cyber cheating case in bhadradri kothagudem distrct
మరో సైబర్‌ మోసం: బహుమతుల పేరిట రూ. 20 లక్షల దోపిడీ

By

Published : Nov 8, 2020, 7:12 AM IST

విదేశాల నుంచి కానుకల పేరిట సైబర్‌ నేరస్థులు రూ. 20 లక్షలు దోపిడీకి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కానుకల పేరిట 70 వేల పౌండ్ల నగదు వచ్చిందని సైబర్‌ నేరగాళ్లు సందేశం పంపించారు. భారతీయ కరెన్సీగా మార్చేందుకు టాక్స్‌ల పేరిట బాధితుడి నుంచి వివిద దశల్లో మొత్తం రూ. 20 లక్షల 80 వేలు వసూలు చేశారు.

నగదు జమ చేసినా వారు చెప్పిన బహుమతి సొమ్ము ఖాతాలో జమ కాలేదు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఒబామాతో 'జో'డీ నంబర్ ‌1గా..!

ABOUT THE AUTHOR

...view details