హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సునిల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల ఆయన తన సిబిల్ రిపోర్ట్ చూసుకున్నారు. అందులో స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో సునిల్ ఆరు బ్యాంకుల్లో లక్ష చొప్పున రుణం తీసుకున్నట్లు.. ఆ మొత్తాలు చెల్లించకపోవడం వల్ల డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. అయితే ఈ రుణాల విషయం తనకు తెలియదంటూ సునిల్ వాపోయాడు.
'తెలియకుండానే రూ.6 లక్షల రుణం తీసుకున్నారు' - latest cyber crimes in hyderabad
రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు అతడిపై పేరుపై ఆరు బ్యాంకుల నుంచి ఆరు లక్షల రుణం తీసుకున్నారు. పాన్ కార్డు వివరాలు తస్కరించి లోన్లు తీసుకున్నారు.
'తెలియకుండానే రూ.6 లక్షల రుణం తీసుకున్నారు'
బాధితుడి పాన్ కార్డ్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు... ఇతడి వివరాలు వినియోగించి ఆన్లైన్లో ఇన్స్టంట్ లోన్ సదుపాయంతో ఈ రుణాలు పొందారని వెల్లడైంది. ఈ మేరకు సునీల్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది.. రుణం ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది... తదితర అంశాలు ఆరా తీయనున్నారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా