సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్లు లాక్‌డౌన్ వేళ పంథా మార్చారు. ముంబయికి మకాం మార్చి.. ప్రైవేటు, కంపెనీలు, కార్పొరేటు సంస్థలు ఇ-మెయిల్స్‌ను హ్యాక్ చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఏఏ సంస్థలు, కంపెనీలతో రూ.లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తున్నారో గుర్తించి నకిలీ మెయిల్స్ పంపించి నగదును వారి ఖాతాల్లోకి వేయించుకుంటున్నారు.
వారం రోజుల్లో ఇద్దరి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల్లోంచి రూ.88 లక్షలు బదిలీ చేసుకున్నారు. వీటిని కోల్‌కతా, ముంబయి, దిల్లీలోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఐపీ చిరునామాలు ముంబయివి ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ గంగాధర్ తెలిపారు.
ఓటీపీలు రాకుండా చేసి...
బాధితుడు:బంజారాహిల్స్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్
నష్టపోయింది:రూ.50 లక్షలు