తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాస్కులు, శానిటైజర్ల పేరుతో రూ.24 లక్షల మోసం - మాస్కుల మోసాలు

సైబర్​ నేరాలు ఎన్ని జరిగినా కొంత మంది మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ ట్రస్ట్ నిర్వాహకులు లాక్​డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్ల కోసం ఆన్​లైన్​లో రూ.24 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయారు. చివరికి సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని పట్టుకున్నారు.

cyber cheater arrested in hyderabad
మాస్కులు, సానిటైజర్ల పేరుతో రూ.24 లక్షల మోసం

By

Published : Dec 9, 2020, 12:43 PM IST

Updated : Dec 9, 2020, 1:44 PM IST

మాస్కులు, శానిటైజర్ల పేరుతో సైబర్ నేరాగాళ్లు రూ. 24 లక్షల మేరకు మోసం చేశారు. హైదరాబాద్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు లాక్​డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్ల కోసం ఆన్​లైన్​లో వెతికారు. సైబర్​ నేరగాళ్లు తమది కెనడాకు చెందిన కంపెనీ అని... మాస్కులు, శానిటైజర్లు సప్లై చేస్తామని చెప్పారు. ఇది నమ్మిన నిర్వాహకులు విడతల వారీగా రూ.24 లక్షలు చెల్లించారు.

మాస్కులు, సానిటైజర్ల పేరుతో రూ.24 లక్షల మోసం

అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మోసపోయామని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధి మోజో... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆగస్టు​లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ తరహా కేసులో బెంజిమెన్ అనే నైజీరియన్​ను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. విచారించగా హైదరాబాద్​ కేసులో బెంజిమెన్ నిందితుడిగా ఉన్నాడని తేలింది. నిందితుడిని పీటీ వారెంట్​పై హైదరాబాద్​కు తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ చదవండి:70 దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్టు

Last Updated : Dec 9, 2020, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details