హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో 389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి కల్పించారు. వీళ్లలో 336 మంది బాలురు, 53 మంది బాలికలున్నారు. 174 మంది పిల్లల్ని తల్లిదండ్రులకు చెంతకు చేర్చగా... మిగతా 215 మంది పిల్లల్ని ఆశ్రమాల్లో ఉంచారు.
389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి - సైబరాబాద్ కమిషనరేట్ తాజా వార్తలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో 389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి కల్పించారు. వీళ్లలో 336 మంది బాలురు, 53 మంది బాలికలున్నారు.
389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి
బాలకార్మికులను పనిలో పెట్టుకున్న 105 మందిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు విముక్తి కల్పించిన బాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 140 మంది పిల్లలున్నారు. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గాజుల పరిశ్రమలో పోలీసులు దాడులు జరిపి బిహార్‌కు చెందిన 17 మందికి విముక్తి కల్పించారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్