ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా గదిరాజ్లో ఉదయం ఏడు గంటలకు రెండో బెటాలియన్‌కు చెందిన సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై శివానంద్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఏకే 47తో కాల్చుకొని సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై ఆత్మహత్య - crpf asi shivand commited suicide
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై ఆహ్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా గదిరాజ్లో ఉదయం ఏడు గంటలకు తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

సీఆర్ఫీఎఫ్ జవాన్ ఆత్మహత్య
శివానంద్ స్వస్థలం కర్ణాటకలోని బీదర్ జిల్లా అని సీఆర్ఫీఎఫ్ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని సొంతూరు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఇదీ చూడండి:అజ్ఞాతంలోకి అశోక్‌రెడ్డి... పోలీసుల గాలింపు ముమ్మరం