ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన యాన్ హోవ్తో పాటు దిల్లీకి చెందిన ధీరజ్, అంకిత్, నీరజ్‌లను పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించడం వల్ల వీలైనంత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
'వారి కోసం రంగంలోకి దిగిన మూడు విభాగాలు' - crores rupees hawala to china by online betting gang
ఆన్లైన్ జూదానికి పాల్పడి కోట్ల రూపాయలను హవాలా చేస్తున్న నలుగురు నిందితుల్ని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అధిక మొత్తంలో నగదు హవాలా కావడం వల్ల ఈడీ, ఐటీ అధికారులు కూడా నిందితులను ప్రశ్నిస్తున్నారు.
హవాలా మార్గం ద్వారా చైనాకు డబ్బులు తరలించినట్లు తేలగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దాదాపు 1,100 కోట్ల రూపాయల డబ్బు హవాలా కావడం వల్ల ఆదాయపన్ను శాఖ దీనిపై దృష్టి సారించింది. నిందితులను సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, ఐటీ అధికారులూ ప్రశ్నిస్తున్నారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బులు తరలించారనే సమాచారం సేకరిస్తున్నారు. బినామీ ఈ-కామర్స్ కంపెనీలు స్థాపించి అన్లైన్ జూదం నిర్వహించిన నిందితులు.. ఇంకా ఏయే తరహాలో మోసాలకు పాల్పడ్డారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :అనుమానం వచ్చి జాగ్రత్తపడ్డాడు.. సైబర్ వల నుంచి బయటపడ్డాడు!