జంటనగరాల్లో నేరాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. పెరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల గస్తీ, ఘటన జరిగిన తర్వాత వేగంగా ఆయా ప్రాంతాలకు చేరుకోవడం వంటి చర్యలే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరిన్ని పటిష్ఠ చర్యలు తీసుకుని నేరాల కట్టడికి అన్ని రకాలుగా కృషి చేయాలని ఉన్నతాధికారులు... సిబ్బందికి సూచిస్తున్నారు. 2018, 19తో పోలిస్తే 2020లో ఇప్పటి వరకు నేరాలు తగ్గినట్టు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
గణాంకాలు ఇలా ఉన్నాయి..
2018లో 80 హత్యలు జరిగాయి. 2019లో 84 హత్యలు జరగ్గా... 2020లో ఇప్పటి వరకు 43 జరిగాయి. 2018లో అల్లర్లు 30, 19లో 34, 2020 లో ఇప్పటి వరకు 14... 2018లో అపహరణలు 402, 19లో 522, 2020 లో 309.... అత్యాచారాలు 2018లో 274, 19లో 301, 2020లో 216, మోసాల కేసులు 18లో 1650, 19లో 1746, 2020లో ఇప్పటి వరకు 831 జరిగాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 2018లో 2130, 19లో 2611, 2020లో 1322 నమోదయ్యాయి. మాదకద్రవ్యాల కేసులు 2018 లో 55, 19లో 98, 2020లో ఇప్పటి వరకు 58 నమోదయ్యాయి.
కేసులు | 2018 | 2019 | 2019 |
హత్యలు | 80 | 84 | 43 |
అత్యాచారాలు | 274 | 301 | 216 |
అల్లర్లు | 30 | 34 | 14 |
అపహరణలు | 402 | 522 | 309 |
మోసాలు | 1650 | 1746 | 831 |
మహిళపై వేధింపులు | 2130 | 2611 | 1322 |
మాదకద్రవ్యాలు | 55 | 98 | 58 |
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు....