తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బౌలింగ్ చేస్తూ... క్రీడాకారుడు మృతి - Bowler died in mahabubnagar

క్రికెట్​ టోర్నమెంట్​లో బౌలింగ్ చేస్తూ... కిందపడిపోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

బౌలింగ్ చేస్తూ... క్రీడాకారుడు మృతి
బౌలింగ్ చేస్తూ... క్రీడాకారుడు మృతి

By

Published : Jan 6, 2021, 8:27 AM IST

క్రికెట్ ఆడుతూ మధ్యలో కిందపడిపోయి క్రీడాకారుడు మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జడ్చర్ల జాతీయ రహదారి పక్కన టైర్ పంచర్ దుకాణం నిర్వహిస్తున్న సాదిక్.. క్రికెట్ ఆటగాడు. జిల్లా కేంద్రంలోని మహబూబ్​నగర్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్​లో జడ్చర్ల జట్టు తరఫున పాల్గొని సాదిక్ బౌలింగ్ చేస్తుండగా మధ్యలో కుప్పకూలిపోయాడు.

వెంటనే అతనికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. క్రికెట్ ఆడుతూ మృతి చెందడం పట్ల క్రీడాకారుల్లో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవీ చూడండి:గ్రేటర్‌పై గెజిట్ నోటిఫికేషన్‌ కోసం.. భాజపా కార్పొరేటర్ల పోరు

ABOUT THE AUTHOR

...view details